తల్లి కాబోతున్న మరో హీరోయిన్

పెళ్లి చేసుకున్న హీరోయిన్లంతా ఈ లాక్ డౌన్ టైమ్ లో గర్భం దాల్చుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వరుసగా హీరోయిన్లంతా ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మహేష్ బాబు హీరోయిన్ అమృతా రావు కూడా చేరిపోయింది.

మహేష్ బాబు సరసన అతిథి సినిమాలో నటించిన అమృతరావు ప్రస్తుతం 3 నెలల గర్భవతి. ముంబయిలోని ఓ క్లినిక్ నుంచి తన బేబీ బంప్ తో బయటకొస్తున్న అమృతారావు.. మీడియా కంట పడింది. అలా ఆమె గర్భం దాల్చిన విషయం బయటపడింది. 2016లో ఆర్జే అన్మోల్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అమృత. ఇప్పుడు ప్రెగ్నెన్సీని కూడా సీక్రెట్ గా ఉంచాలనుకుంది కానీ కుదరలేదు.

అమృతారావు కంటే ముందు హీరోయిన్ అనిత తను గర్భందాల్చిన విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు అనుష్కశర్మ, హీరోయిన్ కరీనాకపూర్ కూడా తాము గర్భవతులమనే విషయాన్ని బయటపెట్టారు. ఇలా ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా ఒకేసారి తల్లులు కాబోతున్నారు.