సింపుల్ గా కాజల్ పెళ్లి

డబ్బున్నోళ్ల పెళ్లిళ్ల ఆడంబరంగా జరుగుతాయి. డబ్బున్న సినిమావాళ్ల పెళ్లిళ్లు ఇంకాస్త ఎక్స్ ట్రా ఆడంబరంగా జరుగుతాయి. ఈమధ్య ఇలాంటి జనాలంతా విదేశాలకు వెళ్లి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నెలాఖరుకు కాజల్ పెళ్లి ఉంది. ఈమె పెళ్లి కూడా గ్రాండ్ గా జరుగుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ కాజల్ మాత్రం చిన్నపాటి షాక్ ఇచ్చింది.

అవును.. కాజల్ తన పెళ్లిని చాలా నిరాడంబరంగా జరుపుకోబోతోంది. ముంబయిలో ఉంటున్న ఈ బ్యూటీ, కనీసం హోటల్ లో కూడా పెళ్లి చేసుకోవడం లేదు. తన ఇంట్లోనే సింపుల్ గా పెళ్లి చేసుకోబోతోంది. ఈ మేరకు కాజల్ ఇంట్లో ఏర్పాట్లు మొదలయ్యాయి.

పెళ్లి కోసమే కాజల్ ఇంటిని ఈమధ్య రీమోడలింగ్ చేశారు. ఆమె ఇంట్లో 4 బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఇంటిముందు విశాలమైన స్థలం ఉంది. అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ఈ చందమామ.

గౌతమ్ తో ఈనెల 30న జరగబోయే పెళ్లికి ఎవ్వర్నీ ఆహ్వానించడం లేదు కాజల్. కేవలం కాజల్ కుటుంబం, గౌతమ్ ఫ్యామిలీ మాత్రమే ఉంటారు. ఈమాత్రం దానికి హోటల్ లో పెళ్లి చేసుకోవడం దండగని కాజల్ భావించినట్టుంది.