అన్నీ దసరా తర్వాతే..!

కరోనా మొదలైనప్పట్నుంచి ఇంటికే పరిమితమైపోయాడు పవన్ కల్యాణ్. తను రీఎంట్రీ ఇచ్చిన సినిమాని పూర్తిస్థాయిలో పక్కనపెట్టాడు. కనీసం డబ్బింగ్ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. అలా 7 నెలలుగా ఆగిపోయిన వకీల్ సాబ్ సినిమా ఈమధ్యే మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. అయినప్పటికీ పవన్ షూట్ లో జాయిన్ అవ్వలేదు. ఇన్నాళ్లకు పవన్ కాల్షీట్లపై క్లారిటీ వచ్చింది.

దసరా తర్వాత పవన్, వకీల్ సాబ్ సెట్స్ పైకి వస్తాడు. నవంబర్ మొత్తం వకీల్ సాబ్ పని మీదే ఉంటాడు. ఆ నెల రోజుల్లో సినిమా పూర్తిచేసి, క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు షిఫ్ట్ అవుతాడు. ఆ తర్వాత ఇంకొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి హరీశ్ శంకర్ సినిమా మొదలుపెడతాడు.

ఇలా తన సినిమాలకు సంబంధించి పూర్తిస్థాయిలో కాల్షీట్లు సర్దుబాటు చేశాడు పవన్. అటు పవన్ రావడంతో.. హీరోయిన్ శృతిహాసన్ కూడా నవంబర్ నుంచి వకీల్ సాబ్ సెట్స్ పైకి వచ్చేందుకు అంగీకరించింది.