మరో టాలీవుడ్ ప్రముఖుడికి కరోనా

ఇప్పటికే రాజమౌళి, తమన్న, కీరవాణి, బండ్ల గణేశ్, నాగబాబు లాంటి ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడీ లిస్ట్ లోకి రాజశేఖర్ కూడా చేరాడు. అవును.. ఈ సీనియర్ హీరోకు కరోనా సోకింది. కేవలం రాజశేఖర్ కు మాత్రమే కాదు, అతడి కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఈ హీరో వెల్లడించాడు.

రాజశేఖర్, అతడి భార్య జీవితతో పాటు కూతుళ్లు శివానీ, శివాత్మికకు కరోనా సోకింది. వీళ్లకు కరోనా సోకి దాదాపు వారం అవుతోంది. అప్పట్నుంచి వీళ్లంతా హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో ఉంటున్నారు. రాజశేఖర్ స్వయంగా వెల్లడించే వరకు వీళ్లకు కరోనా సోకిన విషయం బయటకురాలేదు.

ప్రస్తుతానికి శివానీ, శివాత్మిక పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. రాజశేఖర్, జీవిత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. త్వరలోనే అంతా ఇంటికి వెళ్తామనే ఆశాభావాన్ని వ్యక్తంచేశాడు రాజశేఖర్.

నీలకంఠ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు రాజశేఖర్. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి వస్తుంది.