బాలయ్య సరసన మల్లూ బ్యూటీ

బాలయ్య సరసన ఓ కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయడానికి చాలా ట్రై చేశాడు బోయపాటి శ్రీను. ఈ మేరకు ఇద్దరు అమ్మాయిల్ని కూడా ఫైనలైజ్ చేశాడు. వీళ్లలోంచి ఒకర్ని అధికారికంగా ఎనౌన్స్ చేస్తామన్నాడు. కానీ ఎందుకో బాలయ్య సరసన కొత్తమ్మాయిలు సెట్ కాలేకపోయారు. దీంతో మరోసారి మలయాళీ బ్యూటీ వెంట పడ్డాడు బోయపాటి.

ఈసారి బాలయ్య కోసం కేరళ నుంచి ప్రయాగ మార్టిన్ అనే ముద్దుగుమ్మను తీసుకొచ్చాడు. ఫిజిక్, లుక్స్ పరంగా చూసుకుంటే ఈ ముద్దుగుమ్మ బాలయ్య సరసన సరిగ్గా సూట్ అవుతుంది. అంతేకాదు.. ఈ సినిమా హిట్టయితే, భవిష్యత్తులో వెంకటేశ్, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు ఈమెను కన్సిడర్ చేసే అవకాశం కూడా ఉంది

అయితే ప్రయాగ మార్టిన్ పేరును ఇంకా అధికారికంగా వెల్లడించలేదు యూనిట్. ప్రస్తుతం వీళ్ల దృష్టి మొత్తం తిరిగి షూటింగ్ ను ప్రారంభించే అంశంపైనే ఉంది. బాలయ్యతో సంబంధం లేకుండా, నవంబర్ నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు బోయపాటి. బాలయ్య లేకుండా మిగతా ఆర్టిస్టులతో షూట్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత బాలయ్యను సెట్స్ పైకి తీసుకురావాలనేది ప్లాన్. ఇదంతా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత హీరోయిన్ పేరును ప్రకటిస్తారు.