మహాసముద్రంలోకి మరో బ్యూటీ

ఎట్టకేలకు మహాసముద్రం సినిమాకు సంబంధించి కీలక నటీనటుల ఎంపిక పూర్తయింది. ఈ సినిమా కోసం తాజాగా అను ఎమ్మాన్యుయేల్ ను తీసుకున్నారు. ఆమె రాకతో ప్రాజెక్టుకు సంబంధించి హీరోహీరోయిన్ల ఎంపిక పూర్తయింది.

ముందుగా ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ పేరును, సెకెండ్ హీరోగా సిద్దార్థ్ పేరును ప్రకటించారు. ఆ తర్వాత మెయిన్ హీరోయిన్ గా అదితిరావు హైదరీ పేరు ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు అను ఎమ్మాన్యుయేల్ పేరు ప్రకటించారు. దీంతో మహాసముద్రం సినిమాకు సంబంధించి హీరోహీరోయిన్లు ఫిక్స్ అయినట్టయింది.

నిజానికి ఈ సినిమాలో ముందుగా నాగచైతన్య లేదా రవితేజను హీరోగా తీసుకోవాలనుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. హీరోయిన్లుగా సమంత, రాశిఖన్నా, ప్రణీత, పాయల్ రాజ్ పుత్ పేర్లు తెరపైకొచ్చాయి. అవేవీ వర్కవుట్ కాలేదు. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.