నిఖిల్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

ఎట్టకేలకు నిఖిల్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది. ఎన్నో దోబూచులాటలు, మరెంతో ఉత్కంఠ మధ్య నిఖిల్ హీరోగా నటించనున్న 18-పేజెస్ సినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించనుంది. ఈ సినిమా కోసం చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతున్న కృతి షెట్టిని కూడా అనుకున్నారు. ఫైనల్ గా ఆ అవకాశం అనుపమ పరమేశ్వరన్ కు దక్కింది.

అనుపమకు తెలుగులో అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. గతేడాది ఆమె రాక్షసుడు సినిమా చేసింది. ఆ తర్వాత ఆమెకు వచ్చిన అవకాశం ఇదే. దీంతో ఈ సినిమాపైనే అనుపమ గంపెడాశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్టయితే అనుపమకు కూసింత క్రేజ్ వస్తుంది. లేదంటే ఆమెకు మరింతగా అవకాశాలు తగ్గిపోతాయి.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించాడు. స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిపెట్టాడు. సూర్యప్రతాప్ ఈ సినిమాకు దర్శకుడు. గోపీసుందర్ మ్యూజిక్ డైరక్టర్.