అఖిల్ కెరీర్ సెట్ అయిందట….

కెరీర్ లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ కూడా కొట్టలేకపోయాడు అఖిల్. కానీ ఇప్పుడేమో తన కెరీర్ సెట్ అయిపోయిందని అంటున్నాడు. అయితే రియల్ లైఫ్ లో కాదు. సినిమాలో భాగంగా ఈ డైలాగ్ కొట్టాడు అక్కినేని హీరో.

“కెరీర్ ని సూప‌ర్ గా సెట్ చేసా.. ఈ మ్యారీడ్ లైఫే. ఓ అయ్యాయ్య‌య్యో..” అంటూ ఓ డైలాగ్ వీడియో రిలీజ్ చేశాడు అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు సంబంధించిన డైలాగ్ ఇది. ఈ సినిమా టీజర్ ను 25వ తేదీన దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించి ప్రీ-టీజర్ లుక్ లో భాగంగా ఈరోజు ఓ వీడియో రిలీజ్ చేశారు. అఖిల్ డైలాగ్ చెప్పింది ఈ వీడియోలోనే.

ఈ సందర్భంగా సినిమా విడుదలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తమ సినిమా కచ్చితంగా సంక్రాంతికే వచ్చి తీరుతుందని విస్పష్టంగా ప్రకటించారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.