చిరు చేతికి మరో రీమేక్

రీఎంట్రీ తర్వాత చిరంజీవి పూర్తిగా రీమేక్స్ పైన ఆధారపడినట్టు కనిపిస్తోంది. ఖైదీ నంబర్ 150 అనే రీమేక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ప్రస్తుతం తన చేతిలో మరో 2 రీమేక్స్ పెట్టుకున్నారు. వీటిలో ఒకటి లూసిఫర్ రీమేక్ కాగా… రెండోది వేదాళం రీమేక్. ఇప్పుడు మరో రీమేక్ పై కూడా చిరంజీవి దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.

తమిళ్ లో సూపర్ హిట్టయిన అన్నై అరిందాళ్ అనే సినిమాపై చిరు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. తమిళ్ లో అజిత్ హీరోగా వచ్చిన పోలీస్ స్టోరీ ఇది. ఇందులో అజిత్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడు. పైగా మిడిల్-ఏజ్డ్ హీరోగా సినిమా ఇది. అందుకే చిరంజీవిని ఇది ఆకర్షించి ఉంటుంది.

ప్రస్తుతం పవన్ తో ఓ సినిమా చేస్తున్న ఏఎం రత్నం, ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. పవన్ రిఫరెన్స్ తో చిరంజీవిని కలిసిన ఏఎం రత్నం, గ్రీన్ సిగ్నల్ అందుకున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై మెగా కాంపౌండ్ నుంచి ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు.