కంగనాను నడిరోడ్డుపై రేప్ చేస్తాడట…. ఒడిశా లాయర్ కామెంట్

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా మారిన కంగనా రనౌత్ ను ఓ వ్యక్తి బెదిరించాడు. నడిరోడ్డుపై అత్యాచారం చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ బెదిరింపులకు పాల్పడింది కూడా ఓ లాయర్ కావడం గమనార్హం.

రీసెంట్ గా కంగనాపై మరో కేసు నమోదైంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశద్రోహం కేసు నమోదైంది. దీనిపై స్పందించిన కంగన.. మహారాష్ట్ర ప్రభుత్వం తనను చూడకుండా ఉండలేకపోతోందని, త్వరలోనే మనాలీ నుంచి ముంబయి వస్తానని ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కు సంబంధించిన కామెంట్స్ సెక్షన్ లో ఒడిశాకు చెందిన ఓ లాయర్.. కంగనాను నడిరోడ్డుపై రేప్ చేస్తానంటూ కామెంట్ పెట్టాడు.

అయితే ఆ వెంటనే సదరు లాయర్ నుంచి మరో వివరణ వచ్చింది. తన ఎకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని, తన ఎకౌంట్ లో ఉన్న పోస్ట్ గురించి ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పినంత వరకు తనకు తెలియదని.. వెంటనే దాన్ని డిలీట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఈ మొత్తం వ్యవహారంపై కంగనా ఇంకా స్పందించలేదు.