ప్రభాస్ సోలో లుక్ వచ్చేసింది

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ పోస్టర్ రిలీజైంది. అదే రోజు ప్రభాస్-పూజా హెగ్డే కలిసున్న స్టిల్ కూడా రిలీజ్ చేశారు. ఈరోజు ప్రభాస్ సోలో లుక్ తో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. అతడి క్యారెక్టర్ పేరు కూడా బయటపెట్టారు.

రాధేశ్యామ్ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఈ క్యారెక్టర్ చాలా స్టయిలిష్ గా ఉంటుందనే విషయాన్ని తాజాగా రివీల్ చేసిన లుక్ లో బయటపెట్టారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 23న రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. దానికి ముందుగా ఈ పోస్టర్ విడుదల చేయడంతో మోషన్ పోస్టర్ పై మరింత ఆసక్తి పెరిగింది.

ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఇటలీలో జరుగుతోంది. ప్రభాస్, పూజా హెగ్డే అక్కడే ఉన్నారు. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే.. బాహుబలి-2 రిలీజైన ఏప్రిల్ 28న రాధేశ్యామ్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు.