సంక్రాంతి బరిలో మరో సినిమా

సంక్రాంతి బెర్తులు మెల్లమెల్లగా నిండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు సంక్రాంతి రిలీజులపై కర్చీఫ్ లు వేయగా.. తాజాగా ఈ లిస్ట్ లోకి రానా కూడా చేరాడు. రానా హీరోగా నటించిన అరణ్య సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ.

నిజానికి ఈ సినిమా ఏడాది కిందటే పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 న విడుదల చేయాలనుకున్నారు. కానీ అంతలోనే కోరనా/లాక్ డౌన్ వల్ల సినిమా వాయిదా పడింది. అలా వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతికి షెడ్యూల్ అయింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది.

సంక్రాంతికి ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అల్లుడు అదుర్స్, రంగ్ దే సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. లిస్ట్ లోకి ఉప్పెన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడీ పోటీలోకి అరణ్య కూడా ప్రవేశించింది.