మరోసారి తెరపైకి రియల్ స్టార్

రియల్ స్టార్ శ్రీహరి ఈ లోకాన్ని వీడి వెళ్లిన తర్వాత అతడి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తున్నారు శ్రీహరి కుటుంబ సభ్యులు, అతడి ఫ్యాన్స్. అయితే అలాంటి వాళ్లకు ఊహించని విధంగా శ్రీహరి నటించిన ఓ కొత్త సినిమా అందుబాటులోకి వచ్చింది. దీంతో అంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. అప్పుడెప్పుడో నర్తనశాల అనే సినిమాను స్టార్ట్ చేశారు బాలకృష్ణ. తనే నిర్మాతగా, దర్శకుడిగా ఆ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత సౌందర్య ఓ యాక్సిడెంట్ లో కన్నుమూసింది. అదే టైమ్ లో మరికొన్ని ఆర్థిక కారణాల వల్ల నర్తనశాల ప్రాజెక్టు ఆగిపోయింది.

అలా ఆగిపోయిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు తెరపైకి వచ్చింది. నర్తనశాల సినిమాకు సంబంధించి గతంలో తీసిన సన్నివేశాల్ని 24న ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. 17 నిమిషాల నిడివి కలిగిన ఈ సన్నివేశాల్లో శ్రీహరి కూడా ఉన్నారు. సినిమాలో ఆయన భీముడిగా కనిపించబోతున్నారు. ఆ పాత్ర ఫస్ట్ లుక్ ను కూడా ఈరోజు రిలీజ్ చేశారు. దీంతో శ్రీహరి అభిమానులు, అతడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇదే సినిమాతో సౌందర్యను మరోసారి చూసే అవకాశం కూడా ప్రేక్షకులకు దక్కనుంది.