మూడో పెళ్లి కూడా పెటాకులైంది

వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన తమిళ నటి వనిత విజయ్ కుమార్, మరోసారి తన పెళ్లిని బ్రేకప్ చేసుకుంది. ఈ ఏడాదిలోనే పీటర్ పాల్ ను పెళ్లి చేసుకుంది వనిత. పెళ్లయి ఏడాది కూడా తిరక్కుండానే, అతడికి కూడా దూరమైంది. వనిత జీవితంలో ఇది మూడో పెళ్లి, మూడో విడాకులు కూడా.

తన భర్త నుంచి దూరంగా జరిగిన విషయాన్ని వనిత స్వయంగా ప్రకటించింది. ప్రేమ విషయంలో తను మోసపోతూనే ఉన్నానని, జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నానని ఆమె ట్వీట్ చేసింది. ప్రేమలో విఫలం కావడం తనకు అలవాటైపోయిందని, గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లాడాడు పీటర్ పాల్. అప్పట్లో ఆ వ్యవహారం పెనుదుమారం రేపింది. వాటిని ధైర్యంగానే ఎదుర్కొంది వనిత. తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి గోవాకు హనీమూన్ వెళ్లారు. సరిగ్గా అక్కడే వ్యవహారం తేడాకొట్టింది.

గోవాలో ఫుల్లుగా తాగేశాడట పీటర్ పాల్. అతడికి అంత తాగుడు అలవాటు ఉందని వనితకు తెలియదంట. చెన్నై వచ్చేంత వరకు తాగుతూనే ఉన్నాడట. మనుషుల సహాయంతో అతడ్ని ఇంట్లోకి తీసుకురావాల్సి వచ్చిందట. దీంతో వనితకు చిర్రెత్తుకొచ్చింది. పీటర్ కు మత్తు దిగిన వెంటనే ఇంటి నుంచి తరిమేసిందని కోలీవుడ్ టాక్.