రాజశేఖర్ కు ఇప్పుడెలా ఉంది?

హీరో రాజశేఖర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వారం రోజుల కిందటే రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. హైదరాబాద్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కూడా తీసుకుంది. అలా రాజశేఖర్ భార్య జీవితతో పాటు ఆయన కుమార్తెలు శివానీ, శివాత్మిక కరోనా నుంచి కోలుకున్నారు.

అయితే రాజశేఖర్ ఆరోగ్యం మాత్రం ఇంకా పూర్తిస్తాయిలో నార్మల్ కు రాలేదు. దీనికితోడు ఈరోజు ఉదయం నుంచి ఆయన ఆరోగ్యం విషమించినట్టు పుకార్లు ఊపందుకోవడంతో శివాత్మిక రంగంలోకి దిగింది.

తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఎలాంటి పుకార్లు నమ్మవద్దంటూ ట్వీట్ చేసింది శివాత్మిక. ఆ వెంటనే కొన్ని గంటలకు హాస్పిటల్ యాజమాన్యం కూడా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఆయన ఐసీయూలోనే ఉన్నప్పటికీ.. ఆక్సిజన్ సహాయం లేకుండానే ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు.

దీంతో రాజశేఖర్ ఆరోగ్యంపై వచ్చిన పుకార్లకు చెక్ పడింది. అయితే ఇన్ని రోజులైనప్పటికీ ఆయన కోలుకోకపోవడంతో కొంతమంది ఇంకా అనుమానం వ్యక్తంచేస్తూనే ఉన్నారు. చిరంజీవి లాంటి ప్రముఖులు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.