కొమరం భీమ్ అదరగొట్టాడు

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తారక్ టీజర్ రానే వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి కొమరం భీమ్ టీజర్ ను ఈరోజు రాజమౌళి రిలీజ్ చేశాడు. ఆ టీజర్ చూస్తే.. మేకింగ్ పరంగా రాజమౌళికి, ఇతర దర్శకులకు ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది.

ప్రతి షాట్ లో పెర్ఫెక్షన్, ప్రతి ఫ్రేమ్ లో హీరోయిజం కొట్టొచ్చినట్టు కనిపించింది. తారక్ ను ఇప్పటివరకు ఎవ్వరూ చూపించని మోస్ట్ పవర్ ఫుల్ లుక్ లో ప్రజెంట్ చేశాడు రాజమౌళి. టీజర్ లో ఎన్టీఆర్ గెటప్ అదిరింది. కెమెరావర్క్, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి.

ఇవన్నీ ఒకెత్తయితే ఈ టీజర్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ మరో ఎత్తు. ఇంతకుముందు రిలీజైన చరణ్ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ టీజర్ కు అన్ని భాషల్లో చరణ్ వాయిస్ ఓవర్ చెప్పాడు.