చిన్న వీడియోకు పెద్ద ట్రయిలర్

ఈ దసరాకు బాలయ్య తన నర్తనశాల సినిమాను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. దీన్ని సినిమా అనే కంటే 17 నిమిషాల వీడియో అనడం కరెక్ట్. అయితే రిలీజ్ చేసేది వీడియోనే అయినప్పటికీ.. ప్రచారంలో మాత్రం బాలయ్య తగ్గడం లేదు. ఓ ఫుల్ లెంగ్త్ సినిమాకు ఎంత ప్రచారం చేయాలో అంత చేస్తున్నాడు.

17 నిమిషాల వీడియోకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏకంగా ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఇక్కడితో ఆగలేదు బాలయ్య. 17 నిమిషాల వీడియో కోసం ఏకంగా 30 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇలా పూర్తిస్థాయిలో ప్రచారం చేసి మరీ నర్తనశాల వీడియోను రిలీజ్ చేస్తున్నారు. శ్రేయాస్ ఈటీలో 50 రూపాయలు చెల్లించి ఈ సినిమాను చూడొచ్చు. వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ఛారిటీకి ఇస్తానంటున్నాడు బాలయ్య.