ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదు – మేకపాటి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణ ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చేశారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ప్రస్తుతం కరోనా కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తున్నా సెకండ్ వేవ్‌ దాడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో పరిస్థితిని అంచనా వేయాలన్నారు.

బీహర్‌లో అసెంబ్లీ ఎన్నికల పరిస్థితిని ఇక్కడి స్థానిక సంస్థలకు పోలిక లేదన్నారు. బీహర్‌లో అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. కానీ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అంత తప్పనిసరి పరిస్థితి ఏమీ లేదన్నారు.

అటు ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ నిమ్మగడ్డ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో ఏకపక్షంగాఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డే… ఇప్పుడు ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వం సహకరించడం లేదని కోర్టుకెక్కారు. ఈనెల 28న రాజకీయ పార్టీలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని మేకపాటి చెప్పడం చర్చనీయాంశమైంది.