వకీల్ సాబ్ డేట్ మారింది

లెక్కప్రకారం వకీల్ సాబ్ టీజర్ దసరాకు రావాలి. యూనిట్ నుంచి అధికారికంగా సమాచారం లేనప్పటికీ పవన్ ఫ్యాన్ గ్రూపుల్లో ఇంటర్నల్ గా ఈ విషయం పాకిపోయింది. మేకర్స్ కూడా దసరాకే అన్నీ అన్నట్టు రెడీ చేసుకున్నారు. కట్ చేస్తే, వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ వాయిదా పడింది.

అవును.. దసరాకు రావాల్సిన వకీల్ సాబ్ టీజర్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కుదిరితే దీపావళికి టీజర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ మార్పు ఎందుకనేది ఎవ్వరికీ అంతుచిక్కకుండా ఉంది.

నిజానికి 2 వారాల కిందటే వకీల్ సాబ్ టీజర్ పనులు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. టీజర్ వర్క్ కూడా పూర్తయింది. తలుచుకుంటే దసరాకు రిలీజ్ చేయొచ్చు. కానీ ఆఖరి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. పవన్ తో చర్చించి, రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత.. ఏకంగా విడుదల తేదీతో టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నాడట.