సర్వే రాళ్లపై జగన్ బొమ్మ లేనట్టే…

రాష్ట్ర వ్యాప్తంగా భూవివాదాలకు శాశ్వతంగా చెక్‌ పెట్టేందుకు భూ సమగ్ర సర్వేకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ నేపథ్యంలో సర్వేలో పాతేందుకు ఉపయోగించే సర్వే రాళ్లపై జగన్‌మోహన్ రెడ్డి బొమ్మను ఏర్పాటు చేస్తున్నారంటూ మీడియాలో కథనం వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఒక పత్రిక ప్రచురించింది.

ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు సర్వే అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వానికి చెప్పకుండా, సీఎంవోనూ సంప్రదించకుండా సర్వే రాళ్లపై ముఖ్యమంత్రి బొమ్మ ఏర్పాటు నిర్ణయం ఎలా తీసుకున్నారని సదరు అధికారిపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాాచారం.

ఇలాంటి చర్యల వల్ల సీఎంతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవోకు తెలియకుండా కొందరు అత్యుత్సాహంతో ఈ పనిచేశారన్నది అర్థమవుతోంది.

సీఎంవోకు చెప్పకుండా చేయడమే కాకుండా… ముందే పత్రికల్లో ఫోటోలు రావడంపై ప్రభుత్వ పెద్దలు సీరియస్‌ అయ్యారు. జగన్‌ ఫోటో అవసరం లేదని స్పష్టం చేశారు. సదరు మోడల్‌ను కూడా తిరస్కరించారు.