నిమ్మగడ్డ ఇష్టానికి కుదరదు – కొడాలి నాని

ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని తెగేసి చెప్పారు మంత్రి కొడాలి నాని. నిమ్మగడ్డ ఇష్టానికి అన్నీ జరగాలంటే కుదరదని తేల్చేశారు. తాను చెప్పేదే రాజ్యాంగం అన్నట్టుగా నిమ్మగడ్డ తీరు ఉందన్నారు. మరి కొన్ని నెలల్లోనే నిమ్మగడ్డ రిటైర్ అయి హైదరాబాద్‌ ఇంట్లో కూర్చుంటారన్నారు.

నవంబర్, డిసెంబర్‌లో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్నారు. నిమ్మగడ్డ చెబితే ఎన్నికలు ఆగాలి… ఆయన అనుకుంటే జరగాలని అంటే కుదరదని స్పష్టం చేశారు.

ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశారు కానీ… ఇప్పుడు ప్రభుత్వంతో చర్చించకుండా ఎన్నికలు నిర్వహించలేరన్నారు.

బీహర్‌లో అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి తప్పనిసరిగా నిర్వహించాల్సి రావడంతో అక్కడ ముందుకెళ్లారని… ఇక్కడ అంత అత్యవసరం ఏమీ లేదన్నారు కొడాలి నాని.