అయ్యో… మహేష్ ఏంటి ఇలా చేశాడు

నిన్నంతా ఓ రేంజ్ లో ప్రభాస్ మేనియా నడిచింది. పుట్టినరోజు నాడు అతడికి శుభాకాంక్షలు చెప్పడానికి టాలీవుడ్-బాలీవుడ్ ఏకమైంది. ఈ క్రమంలో మహేష్ బాబు కూడా ప్రభాస్ కు బర్త్ డే విశెష్ చెప్పాడు. అయితే ఆ వెంటనే ఆ పోస్టును డిలీట్ చేశాడు. ఎందుకో చూద్దాం..

ప్రభాస్ కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పాడు మహేష్. అతడ్ని ట్యాగ్ కూడా చేశాడు. అయితే మహేష్ కు తెలియని విషయం ఏంటంటే.. ప్రభాస్ ఎకౌంట్ అనుకొని మరో ఫేక్ ఎకౌంట్ ను ట్యాగ్ చేసి శుభాకాంక్షలు చెప్పాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే పొరపాటు తెలుసుకున్న మహేష్.. ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. ప్రభాస్ ఇనస్టాగ్రామ్ లో ఉన్నాడని తెలుసుకొని, అందులో అతడికి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ విషయం తెలియక, మహేష్ ట్వీట్ డిలీట్ చేశాడంటూ చాలామంది పెడార్థాలు తీశారు.