సూర్య సినిమా అలా వాయిదా పడింది

ఊహించని విధంగా సూర్య సినిమా వాయిదాపడింది. అతడు నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా ఈ నెలాఖరుకు ఓటీటీ రిలీజ్ కు షెడ్యూల్ అయింది. కానీ ఇప్పుడా సినిమాను వాయిదావేశారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. తన సినిమా వాయిదా పడిన విషయాన్ని స్వయంగా హీరో సూర్య ప్రకటించాడు.

“ఆకాశం నీ హ‌ద్దురా’ (సూరారై పొట్రు) చిత్రం వైమానిక రంగం నేప‌థ్యంలో న‌డిచే క‌థ అని అంద‌రికీ తెలిసిందే. కాబ‌ట్టి మేం అనేక ప‌ద్ధ‌తులు పాటించాల్సి వ‌చ్చింది. చాలా ప‌ర్మిష‌న్లు తీసుకోవాల్సి వ‌చ్చింది. ఇది జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన వ్య‌వ‌హారం. మేం నిజ‌మైన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలు, సెక్యూరిటీతో డీల్ చేయాల్సి వ‌చ్చింది. కొన్ని ఎన్ఓసీలు (నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్లు) అనుమ‌తుల కోసం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిరీక్ష‌ణ అనివార్య‌మ‌ని మేం అర్థం చేసుకున్నాం.”

ఇలా తన సినిమా వాయిదా వెనక కారణాన్ని బయటపెట్టాడు సూర్య. ఈ జాప్యాన్ని శ్రేయోభిలాషులు, అభిమానులు అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తున్న సూర్య.. ఈ గ్యాప్ లో ట్రయిలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు అన్నీ చేతికొచ్చిన తర్వాత ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.