ట్రయిలర్ పేరు చెప్పి సినిమా చూపించారు

కీర్తి సురేష్ నుంచి మరో సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఇప్పటికే ఈమె నటించిన పెంగ్విన్ సినిమా ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు మరో సినిమా ఓటీటీ బాట పట్టింది. ఆమె నటించిన మిస్ ఇండియా సినిమా నెట్ ఫ్లిక్స్ లో వచ్చేనెల 4వ తేదీన స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ట్రయిలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఆ ట్రయిలర్ ఎలా ఉందంటే.. సినిమా మొత్తాన్ని 2 నిమిషాల ట్రయిలర్ లో చెప్పేశారు.

ఓ మిడల్ క్లాస్ అమ్మాయిగా కీర్తిసురేష్ ఇందులో నటించింది. ఎంబీఏ చదివి పెద్ద వ్యాపారవేత్త అవ్వాలనేది ఆమె కోరిక. అందుకు తగ్గట్టే అమెరికా వెళ్లి చాయ్ బిజినెస్ పెడుతుంది. సక్సెస్ అవుతుంది. అంతలోనే ఆ బిజినెస్ ను జగపతిబాబు లాక్కోవాలని చూస్తాడు. జగపతి బాబు ఉచ్చు నుంచి కీర్తిసురేష్, సక్సెస్ ఫుల్ గా తన వ్యాపారాన్ని కాపాడుకుంటుంది. ఇదే ఈ సినిమా కథ. ఇందులో మిస్ ఇండియా అనే బ్రాండ్ తో టీ అమ్ముతుంటుంది కీర్తిసురేష్.

ఇలా సినిమా మొత్తాన్ని ట్రయిలర్ లో విడమర్చి చక్కగా చెప్పేశారు.