చేతులు మారిన నాని సినిమా

నాని సినిమా చేతులు మారింది. అతడు హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ సింగరాయ్ అనే సినిమా రావాల్సి ఉంది. ఇప్పుడీ ప్రాజెక్టు మొత్తంగా మరో నిర్మాత చేతిలోకి వెళ్లింది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.

ఇక దసరా సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ బయటపెట్టారు. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటించనుంది. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో ఎంసీఏ అనే సినిమా వచ్చింది. ఇక సెకెండ్ హీరోయిన్ గా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టిని తీసుకున్నారు.

మిక్కీ జే మేయర్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందించబోతున్నాడు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. 2021లో థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్.