పవన్ అస్సలు ఆగట్లేదుగా

పవన్ కల్యాణ్ ఆగేలా లేడు. వరుసపెట్టి సినిమాలు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే చేతిలో 3 సినిమాలున్నాయి. ఒకటి పైప్ లైన్లో ఉంది. అక్కడితో ఆగుతాడేమో అనుకుంటే, తాజాగా మరో సినిమా ప్రకటించాడు. అవును.. ఈరోజు పవన్ నుంచి ఇంకో కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. తమన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ ఇది. అయితే ఈ విషయాన్ని ఇంకా బయటపెట్టలేదు.

ప్రస్తుతం వకీల్ సాబ్ చేస్తున్నాడు పవన్. దీంతో పాటు క్రిష్ సినిమా లైన్లో ఉంది. త్వరలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. పైప్ లైన్లో సురేందర్ రెడ్డి మూవీ కూడా ఉంది. ఇప్పుడు వీటికి అదనంగా సాగర్ చంద్ర సినిమాను ప్రకటించాడు. గమ్మత్తేంటంటే.. వకీల్ సాబ్ కంప్లీట్ అయిన తర్వాత సెట్స్ పైకి వచ్చేది సాగర్ చంద్ర సినిమానే.