సంక్రాంతి లిస్ట్ మళ్లీ పెరిగింది

ఇప్పటికే సంక్రాంతికి కొన్ని సినిమాలు కర్చీఫ్ వేశాయి. ఈ లిస్ట్ లోకి మరో రెండు సినిమాలు చేరాయి. రవితేజ క్రాక్ సినిమా, రామ్ రెడ్ సినిమాలు సంక్రాంతికి రాబోతున్నట్టు ప్రకటనలు వచ్చేశాయి.

ఈ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతాయని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సంక్రాంతికి రాబోతున్నట్టు రామ్, రవితేజ ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు.

సంక్రాంతికి ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రెడీగా ఉంది. రానా అరణ్య, నితిన్ రంగ్ దే సినిమాలు కూడా సంక్రాంతికే సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి క్రాక్, రెడ్ సినిమాలు చేరాయి. మొత్తంగా ఈ సంక్రాంతికి అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.