తెరపైకి మరో కాస్టింగ్ కౌచ్ ఉదంతం

పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఎంతగా పాతుకుపోయిందో తెలియజేసే ఉదంతం ఇది. చివరికి యాంకర్లను కూడా వదలరని ఈ ఘటనతో తేలిపోయింది. ఇప్పుడిప్పుడే యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న వర్షిణి, తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ చేదు అనుభవాన్ని బయటపెట్టింది.

వర్షిణికి ఓ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందట. చర్చిద్దాం రమ్మంటే వెళ్లిందట. ప్రారంభంలో ఆ దర్శకుడు బాగానే మాట్లాడాడట. కొద్దిసేపు గడిచిన తర్వాత చేయి పట్టుకున్నాడట. ఈ ఘటనతో వర్షిణి షాక్ అయింది. వెంటనే అక్కడ్నుంచి బయటకు వచ్చేసిందట.

ఇలా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది వర్షిణి. ఆ టైమ్ లో బయటకొచ్చి తన కారులో చాలా సేపు ఏడ్చానని, ఇద్దరు ఫ్రెండ్స్ తో తప్ప ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎవ్వరితో షేర్ చేసుకోలేదని చెబుతోంది ఈ బ్యూటీ. అయితే ఆ దర్శకుడు ఎవరనే విషయాన్ని మాత్రం ఈమె బయటపెట్టలేదు.