పవన్ కొత్త సినిమా పేరు ఇదేనా?

దసరా సందర్భంగా పవన్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. సితార ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ చంద్ర దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నాడు పవన్. దీనికి సంబంధించి చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఆ ఆడియోను జాగ్రత్తగా వింటే.. అందులో రంగా, బిల్లా లాంటి పేర్లు వినిపిస్తున్నాయంట కొందరికి. దీంతో పవన్ కొత్త సినిమాకు బిల్లారంగ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది.

నిజానికి ఈ టైటిల్ తెరపైకి రావడానికి ఓ కారణం ఉంది. ఇదొక మల్టీస్టారర్ మూవీ. ఇందులో పవన్ కల్యాణ్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. మరో కీలక పాత్రను రానా పోషించబోతున్నాడు. వీళ్లిద్దరి మధ్య ఘర్షణతోనే ఈ సినిమా నడుస్తుందన్నమాట. కాబట్టి ఈ సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్ పెడితే బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం.

నిజానికి బిల్లారంగా అనేది చిరంజీవి టైటిల్. గతంలో చిరు-మోహన్ బాబు కలిసి ఈ సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేశ్ మూలంగా ఈ టైటిల్ మరోసారి తెరపైకి వచ్చింది. మరి ఇదే టైటిల్ ప్రకటిస్తారా లేక మరో ట్రెండీ టైటిల్ వెదుకుతారా అనేది చూడాలి.