ఫ్లోలో వెళ్తానంటున్న రేణుదేశాయ్

రేణుదేశాయ్ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె దర్శకత్వంలో ఇప్పటికే ఆద్య అనే వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది. దీంతో పాటు దసరా సందర్భంగా ఓ కొత్త సినిమాతో కూడా ఆమె రీఎంట్రీ ఇవ్వబోతోంది. తన ఫిల్మీ కెరీర్ పై ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడింది రేణుదేశాయ్. అవకాశాలు వస్తే చేస్తానని, లేదంటే దర్శకత్వంపై దృష్టిపెడతానని చెబుతోంది.

“కరోనా వల్ల ఖాళీ అయిపోయాను. ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నాను. ఇకపై కూడా ఇలానే చేస్తానా లేదా అనేది నాకొచ్చే ఆఫర్ల మీద ఆధారపడి ఉంటుంది. క్యారెక్టర్ నచ్చితే చేసుకుంటూ వెళ్లిపోతాను. అది ఫుల్ లెంగ్త్ రోలా లేక గెస్ట్ రోలా అనేది చూడను. అలా ఫ్లోలో వెళ్లిపోతాను.”

రీఎంట్రీలో రేణుదేశాయ్ కు ఆఫర్లు రావడం గ్యారెంటీ. ఎందుకంటే పవన్ మాజీ భార్యగా ఆమెకు ఓ చిన్నపాటి క్రేజ్ ఉంది. కానీ రేణు మాత్రం ఏ పాత్ర పడితే అది చేయనని, మనసుకు నచ్చిన పాత్రలే చేస్తానంటోంది. ఎన్ని సినిమాల్లో నటించినా, తన తొలి ప్రాధాన్యం మాత్రం దర్శకత్వమే అంటోంది రేణు.