అమితాబ్ పై మరోసారి పుకార్లు

బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి పుకార్లు గుప్పుమన్నాయి. ఆయన షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డారని, వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారని, శనివారం నుంచి ఆయనకు చికిత్స కొనసాగుతోందని ఓ సెక్షన్ బాలీవుడ్ మీడియా వరుసగా కథనాలు ఇచ్చింది. దీనిపై బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్ రియాక్ట్ అయ్యాడు.

తన తండ్రి అమితాబ్ బచ్చన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నాడు. ఎలాంటి గాయం కాలేదని, తనతో పాటు ఇంట్లోనే ఉన్నారని స్పష్టంచేశాడు. మీడియా చెబుతున్నట్టు హాస్పిటల్ లో ఉన్న అమితాబ్, బహుశా తండ్రికి డూప్ అయి ఉండొచ్చని జోకులేశాడు అభిషేక్.

కొన్ని నెలల కిందట అమితాబ్ తో పాటు అతడి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య… ఇలా అంతా ఒకేసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. తర్వాత కోలుకున్నారు. మళ్లీ బిగ్ బి షూటింగ్స్ తో బిజీ అవుతున్న టైమ్ లో ఈ పుకారు రావడంతో అంతా కంగారుపడ్డారు.