రాధేశ్యామ్ స్టోరీలైన్ ఇదే?

ప్రభాస్-పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. మోషన్ పోస్టర్ రిలీజైన తర్వాత ఈ సినిమాపై బజ్ మరింత పెరిగింది. మరీ ముఖ్యంగా సినిమా స్టోరీపై ఊహాగానాలు ఇంకా పెరిగాయి.

ముందుగా అమర ప్రేమికుల్ని గ్రాఫిక్స్ లో చూపించడం, ఆ తర్వాత ఓ చేయి ఇలా విచ్చుకోవడం.. అందులో అందమైన కొండలు, మధ్యలోంచి రైలు.. అప్పుడు హీరోహీరోయిన్లు ట్రైన్ నుంచి బయటకు రావడం లాంటి థీమ్ తో ఈ మోషన్ పోస్టర్ అయింది. దీంతో ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అంటూ అంతా చర్చించుకోవడం స్టార్ట్ చేశారు.

ఈ చర్చలకు మరింత ఆజ్యం పోశాడు సీనియర్ నటుడు సచిన్ కేడ్కర్. రాధేశ్యామ్ మూవీకి సంబంధించి ఓ ఫీలర్ వదిలాడు. ఈ సినిమా బేసిగ్గా జ్యోతిష్యం-సైన్స్ మధ్య నడుస్తుందట. ఈ మూవీలో సచిన్ ఓ డాక్టర్ గా కనిపిస్తాడట. ఈ రెండు విషయాలు మాత్రమే చెప్పి వదిలిపెట్టాడు సచిన్.

ఇక అక్కడ్నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అందుకున్నారు. గత జన్మల కాన్సెప్ట్ కు జ్యోతిష్యం, సైన్స్ లాంటి ఎలిమెంట్స్ కూడా జోడించడంతో ఇది పక్కా పాన్-ఇండియా సినిమా కాబోతోందని వాళ్లు ముందే చెబుతున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.