ఆర్ఆర్ఆర్ వివాదం ఉత్తిదే అంట?

RRR Motion Poster

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చుట్టూ తిరుగుతున్న వివాదం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన ఎన్టీఆర్ టీజర్ లో కొమరం భీమ్ పాత్రను ముస్లిం గెటప్ లో చూపించడంతో వివాదం రాజుకుంది. దీనిపై ఆదివాసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆ దృశ్యాల్ని తొలిగించమని డిమాండ్ చేస్తున్నాయి.

తాజాగా కొమరం భీమ్ మనవడు కూడా స్పందించాడు. చరిత్రను వక్రీకరించొద్దని సూచించాడు. ఆ తర్వాత ఆదిలాబాద్ ఎంపీ కూడా దీనిపై స్పందించారు. కొమరం భీమ్ ను ముస్లిం గెటల్ లో చూపించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆర్ఆర్ఆర్ నుంచి రాజమౌళి ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఆ సినిమాకు డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్న సాయిమాధవ్ బుర్రా మాత్రం స్పందించాడు. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ప్రస్తుతం చెలరేగుతున్న వివాదాన్ని ఆయన కొట్టిపారేస్తున్నాడు. సినిమా చూసిన తర్వాత అంతా రాజమౌళితో ఏకీభవిస్తారని, ఎలాంటి వివాదాలు ఉండవని ధీమాగా చెబుతున్నాడు.