సమంతకు మళ్లీ ఛాన్స్ ఇవ్వని నాగ్

తన మామ నాగార్జున స్థానంలో బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టింది సమంత. దసరా సందర్భంగా వచ్చిన ఎపిసోడ్ లో తన యాంకరింగ్ తో అదరగొట్టింది. ఈ మేరకు ఆమె భారీగానే రెమ్యూనరేషన్ కూడా తీసుకుందని టాక్. ఇదిలా ఉండగా.. ఈ వారాంతం బిగ్ బాస్ తెరపైకి మళ్లీ సమంత రాబోతోందనే టాక్ నడుస్తోంది.

తన కొత్త సినిమా షూటింగ్ కోసం మనాలీకి వెళ్లాడు నాగార్జున. అక్కడే 3 వారాల పాటు ఉంటున్నాడు. కాబట్టి ఈ వీకెండ్ కూడా బిగ్ బాస్ సమంతానే చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ నాగార్జున మాత్రం సమంతకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

ఈ వీకెండ్ బిగ్ బాస్ కు నాగార్జున హాజరవుతున్నాడు. కేవలం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకే మనాలీ నుంచి హైదరాబాద్ వస్తున్నాడు. ఈ వీకెండ్ మాత్రమే కాదు, ఆ తర్వాత వీకెండ్ కూడా ఇలానే చేయబోతున్నాడు.