పవన్ సరసన నేచురల్ బ్యూటీ….

పవన్ కల్యాణ్ ఎంత ఫాస్ట్ గా సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడో, అతడి సినిమాలపై పుకార్లు కూడా అంతే ఫాస్ట్ గా పుట్టుకొస్తున్నాయి. ఓ సినిమా ప్రకటించడం ఆలస్యం, ఆ వెంటనే రూమర్స్ క్యూ కడుతున్నాయి.

మొన్నటికిమొన్న సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించాడు పవన్. ఇప్పుడా సినిమా హీరోయిన్ ఎవరనే అంశంపై జోరుగా రూమర్లు నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా సాయిపల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది.

సహజ నటనకు పెట్టింది పేరు సాయిపల్లవి. పవర్ ఫుల్ యాక్టింగ్ కు కేరాఫ్ పవన్ కల్యాణ్. వీళ్లిద్దరూ కలిస్తే ఆ కాంబినేషన్ కిర్రాక్. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది ఈ సినిమా. ఇందులో హీరోయిన్ పాత్రకు మంచి వెయిట్ ఉంది. ఇలాంటి ఇంపార్టెంట్ రోల్స్ దొరికితే మిస్ చేసుకోదు సాయిపల్లవి.

సో.. ఈసారి పవన్-సాయిపల్లవి కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అంటున్నారు సినీజనాలు.