సుధీర్ బాబు కెరీర్ లో పూర్తి మాస్ సినిమా

సుధీర్ బాబుకు ఓ ఇమేజ్ ఉంది. అతడి సినిమాలన్నీ క్లాస్ టచ్ తో సాగుతాయనే టాక్ ఉంది. మధ్యమధ్యలో ఆయన మాస్ సినిమాలు, రూమర్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేసినప్పటికీ.. సుధీర్ బాబుపై ఉన్న ఇమేజ్ మాత్రం క్లాసే. ఇప్పుడా ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఓ సినిమా చేయబోతున్నాడు ఈ హీరో. ఆ సినిమా పేరు ‘శ్రీదేవి సోడా సెంటర్’.

పలాస లాంటి సినిమాతో దర్శకుడిగా పేరుతెచ్చుకున్న కరుణకుమార్ ఈ సినిమాను డైరక్ట్ చేయబోతున్నాడు. 70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శిశిదేవి‌రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమా రాబోతోంది. ఇంతకుముందు ఇదే బ్యానర్ పై భలే మంచి రోజు అనే సినిమా చేశాడు సుధీర్ బాబు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే నెల నుంచి మొదలుపెట్టబోతున్నారు. మణిశర్మను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.