భయం లేదన్నాడు… లేటుగా స్టార్ట్ చేశాడు

ఈ కరోనా టైమ్ లో రకరకాల మెడిసిన్లు పుట్టుకొచ్చాయి. దీనికి బాలయ్య కూడా ఓ మెడిసిన్ కనిబెట్టారు ఆమధ్య. ఏదో మంత్రం చదివితే కరోనా రాదంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. అంతేకాదు.. కరోనా పూర్తిస్థాయిలో విస్తరించకముందే, తన సినిమా సెట్స్ లో అన్ని రకాల కరోనా నివారణ చర్యలు చేపట్టామని గొప్పగా చెప్పారు.

ఇన్ని గొప్పలు చెప్పిన బాలయ్య.. ప్రభుత్వం అనుమతిచ్చిన వెంటనే సెట్స్ పైకి రావడానికి మాత్రం వెనకడుగు వేశారు. నిజంగా మంత్రం జపిస్తే కరోనా రాదనుకుంటే, బాలయ్య ఎప్పుడో సెట్స్ పైకి రావాలి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సెట్స్ పైకి రావడానికి భయం ఎందుకు..? బాలయ్య అన్నీ మాటల వరకే. చేతలకు వచ్చేసరికి ఏం జరుగుతుందో అందరం చూశాం.

అలా చాన్నాళ్లుగా పక్కనపెట్టిన తన సినిమాను ఎట్టకేలకు సెట్స్ పైకి తీసుకొచ్చాడు బాలయ్య. బోయపాటి దర్శకత్వంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశాడు. ఈ సెట్స్ పైకి కొత్త హీరోయిన్ ప్రయాగ మార్టిన్ కూడా వచ్చి చేరింది.