ఈ సినిమా స్పెషల్ అంటున్న సూర్య

కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించాడు. సూపర్ హిట్ సినిమాలు చేశాడు. కానీ త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఆకాశం నీ హద్దురా మూవీ మాత్రం తనకు చాలా స్పెషల్ అంటున్నాడు సూర్య. ఈ మూవీ ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడాడు.

“ఆకాశం నీ హ‌ద్దురా చిత్రం నాకు చాలా స్పెష‌ల్, ఎందుకంటే ఈ క‌థలో హీరో అంద‌రు అసాధ్యం అనుకున్నే దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాడు. ఇప్పుడు సాధ‌ర‌ణ ప్ర‌జ‌లు కూడా విమానం ఎక్కి తిరుగుతున్నారంటే దానికి కార‌ణం డెక్క‌న్ ఏయిర్ వేస్ ఫౌండ‌ర్ జీఆర్ గోపీనాథ్, ఆయ‌న వ్య‌క్తిగ‌త అంశాలు కొన్ని తీసుకొని ఈ క‌థ‌ను చాలా అద్భుతంగా తెర‌కెక్కించారు సుధ కొంగ‌ర‌, ఇది మ‌నంద‌రి క‌థ అందుకే అంద‌రికీ త‌ప్ప‌క న‌చ్చుతుంద‌ని అని నేను బ‌లంగా న‌మ్ముతున్నాను.”

ఈ సినిమాకు సంబంధించి తన గెటప్ కంటే పెర్ఫార్మెన్స్ పై ఎక్కువగా దృష్టిపెట్టానంటున్నాడు సూర్య. సగటు మనిషి భావోద్వేగాల్ని పండించడం చాలా కష్టమంటున్నాడు.

“ఎన్నో పాత్ర‌లు చేసాను, నా గ‌త చిత్రాలు గ‌జిని, సింగం, సూర్య స‌న్ ఆఫ్ క్రిష‌నన్ లో చాలా వేరేయేష‌న్స్ ఉన్న గెటెప్స్ వేశాను, కానీ ఆకాశం నీహ‌ద్దురా లో మాత్రం ఒక‌రు నిజ‌జీవితంలో చేసిన ప‌నుల్ని నేను అదే రీతిలో ఆన్ స్క్రీన్ చూపించాల్సి వ‌చ్చింది. నా పెర్ఫార్మెమెన్స్ విష‌యంలో ఎక్కువ దృష్టి పెట్టాను. ఓ సగ‌టు మ‌నిషిగా, ఓ ఎయిర్ ఫోర్స్ కెఫ్టెన్ గా ఇలా పలు ర‌కాలు షేడ్స్ ఉన్న పాత్రల్లో ఈ సినిమాలు క‌నిపించ‌బోతున్నాను. ఈ క‌థ విన్నప్పుడు న‌న్ను ఎగ్జైట్ చేసింది కూడా ఈ చిత్రంలో నా పాత్ర స్వ‌భావ‌మే, సుధ డైరెక్ష‌న్ స్కిల్స్ తో పాటు సినిమాటోగ్ర‌ఫి, ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాలు క‌లిసిక‌ట్టుగా వారిలో ఉన్న పూర్తి నైపుణ్యాన్ని పెట్టి ఈ సినిమాకి వ‌ర్క్ చేశారు.”

దీపావళి కానుకగా ఈనెల 12న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో డైరక్ట్ గా విడుదలవుతోంది ఆకాశం నీ హద్దురా సినిమా. ఈ సినిమాపై సూర్య చాలా హోప్స్ పెట్టుకున్నాడు.