ప్రమోషన్ ఫుల్… ఫలితం నిల్

మహానటి తర్వాత ఎన్నో లెక్కలు వేసుకొని, మరెన్నో జాగ్రత్తలు తీసుకొని మిస్ ఇండియా అనే సినిమా చేసింది కీర్తిసురేష్. ఈ మూవీ కోసం చాలా కష్టపడి బరువు కూడా తగ్గింది. కష్టపడి అమెరికాలో షూటింగ్ చేసింది. అయితే ఇంత కష్టపడినా కీర్తికి, సక్సెస్ దక్కలేదు. తాజాగా ఓటీటీలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను నిరాశపరిచింది.

ఈ సినిమా ప్రమోషన్ కోసం కీర్తిసురేష్ చాలా కష్టపడింది. ఈ సినిమా చాయ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కాబట్టి అందుకు తగ్గట్టుగా చాయ్ కు ప్రమోషన్ ఇస్తూ, చాయ్ ఉన్న టీషర్టులు ధరిస్తూ చాలా హంగామా చేసింది కీర్తిసురేష్. అలా ఫుల్లుగా ప్రమోషన్ చేసినప్పటికీ, అనుకున్న రిజల్ట్ మాత్రం రాలేదు.

మిస్ ఇండియా కూడా తుస్సుమనడంలో ఇప్పుడు కీర్తిసురేష్ జడ్జిమెంట్ పై ప్రేక్షకుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. మిస్ ఇండియా కంటే ముందు ఆమె చేసిన పెంగ్విన్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో కీర్తిసురేష్ డైలమాలో పడింది.