పవన్ ఖాతాలో మరో హీరో

త్వరలోనే అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ ను ప్రారంభించబోతున్నాడు పవన్. సాగర్ చంద్ర దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు మరో హీరో కూడా అవసరం. ఎందుకంటే ఇది మల్టీస్టారర్. ఒక హీరోగా పవన్ ఫిక్స్. మరో హీరోపై మాత్రం రోజుకో పుకారు వస్తోంది.

మొన్నటివరకు ఈ రీమేక్ లో రానాను హీరోగా అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు సుదీప్ పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు కొత్తగా గోపీచంద్ పేరు తెరపైకొచ్చింది. వీళ్లలో ఎవ్వర్ని సెకెండ్ హీరోగా తీసుకుంటారనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం.

మరోవైపు ఈ సినిమాలో సెకెండ్ హీరో పాత్ర నిడివిని, ప్రాధాన్యతను తగ్గించేస్తున్నారనే పుకారు కూడా వినిపిస్తోంది. పవన్ హీరోయిజంను పెంచేందుకు, రెండో హీరో పాత్రను తగ్గించేసి, పూర్తిగా విలన్ క్యారెక్టర్ గా మారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రానా, సుదీప్ లాంటి హీరోలు పక్కకు తప్పుకున్నట్టు కథనాలు వస్తున్నాయి.