కూతురు బర్త్ డే కూడా నిర్మాత ఖాతాలోనే

అల్లు అర్జున్ కూతురు అర్హ నిన్న గ్రాండ్ గా తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. పొద్దున్నే బన్నీ తన కూతురికి శుభాకాంక్షలు చెప్పాడు. గుర్రం ఎక్కించాడు. ఖరీదైన బహుమతులు అందించాడు. ఇక సాయంత్రం అయ్యేసరికి భారీ పార్టీ ఏర్పాటుచేశాడు. రాజమండ్రి వేదికగా ఈ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

అంతా బాగానే ఉంది కానీ కూతురు పుట్టినరోజు ఖర్చు మాత్రం బన్నీది కాదు. పుష్ప సినిమా నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ ఖర్చంతా భరించారు. తన కూతురు బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన నిర్మాతలకు సోషల్ మీడియా వేదికగా బన్నీ కృతజ్ఞతలు కూడా చెప్పాడు. కానీ ఇక్కడే నెటిజన్లు కాస్త అసహనం వ్యక్తంచేశారు.

హీరో సెట్స్ లో ఉన్నాడంటే అతడి ఖర్చంతా నిర్మాతదే. ఇంటి నుంచి సెట్స్ కు తీసుకురావడంతో పాటు హీరో, అతడి స్టాఫ్ ఖర్చులన్నీ నిర్మాతే భరిస్తాడు. ఇంకా చెప్పాలంటే నిర్మాత రోజువారీ ఖర్చుల్లో అత్యథిక భాగం హీరో మెయింటెనెన్స్ కే అయిపోతుంది. ఇక ఇప్పుడు హీరోల పిల్లల పుట్టినరోజులు కూడా నిర్మాతలే చేయాలంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

ఈ సంగతి పక్కనపెడితే.. కరోనా నియంత్రణ పేరిట సెట్స్ లో మాస్కులు, శానిటైజర్లతో చేసిన హడావుడి, అర్హ పుట్టినరోజు వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. ఏ ఒక్క ఫొటోలో, ఏ ఒక్కరు ముఖానికి మాస్క్ తో కనిపించలేదు.