డ్రగ్స్‌‌ కేసులో కమెడియన్‌ భర్త అరెస్ట్‌ !

కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌లో కమెడియన్‌ స్టార్‌ భారతి సింగ్‌ భర్త హర్ష్‌ లింబిచాయాను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ కేసులో ఆదివారం ఉదయం నార్కాటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అదుపులోకి తీసుకుంది. దాదాపు 15 గంటలకు పైగా విచారించిన అధికారులు…పక్కా ఆధారాలు దొరకడంతో అరెస్టు చేశారు. శనివారం ఉదయం భారతిని అరెస్టు చేసిన పోలీసులు…ఆ తర్వాత ఆమె భర్తను కూడా అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌లో ఇంకా ఎవరెవరిని అరెస్టు చేస్తారో అన్న ఆందోళన మొదలైంది.

కమెడియన్‌ ఇంట్లో సోదాలు నిర్వహిస్తే 86.5 గ్రాముల డ్రగ్స్‌ దొరికింది. మత్తు కోసం డ్రగ్స్‌ వాడుతున్నట్లు భారతితో పాటు ఆమె భర్త అధికారుల ముందు అంగీకరించారు. ఎక్కువగా గంజాయి సేవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే వాళ్ల ఇంట్లో దొరికిన డ్రగ్స్‌ బట్టి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇటీవల దొరికిన డ్రగ్స్‌ పెడ్లర్స్‌ను విచారిస్తే అసలు విషయాలు తెలిశాయి. బాలీవుడ్‌లో అసలు ఎవరెవరు డ్రగ్స్‌ వాడుతున్నారు? వారి వివరాలేంటి? పూర్తి డేటా సేకరించారు. త్వరలోనే మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.