మంచు విష్ణు ”డబుల్ డోస్”

రేపు మంచు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీనువైట్లతో అతడు చేయబోయే కొత్త సినిమా డీటెయిల్స్ అధికారికంగా బయటపెట్టబోతున్నారు. అయితే అంతకంటే ముందే ఈ ప్రాజెక్టు వివరాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు డబుల్ డోస్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

గతంలో వైట్ల-విష్ణు కాంబినేషన్ లో ఢీ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి సినిమా చేయలేదు. ఇన్నాళ్లకూ వీళ్లిద్దరూ కలవడంతో అది ఢీ సినిమాకు సీక్వెల్ అయి ఉంటుందని అంతా భావించారు.

కానీ ఇదొక కొత్త కథ అని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా డబుల్ డోస్ అనే టైటిల్ పెట్టారంటే.. ఇందులో మంచు విష్ణు డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ మొత్తం గాసిప్స్ లో కొన్నింటిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.