నాని సినిమాకు వెరైటీ టైటిల్

తన సినిమాల్లో కథలు, పాత్రలు మాత్రమే కాదు.. టైటిల్స్ కూడా కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు నాని. ఇందులో భాగంగా తన కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్ పెట్టాడు. “అంటే సుందరానికీ” అనేది నాని కొత్త సినిమా టైటిల్.

గ్యాంగ్ లీడర్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నాని మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి ఈ డిఫరెంట్ టైటిల్ పెట్టారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.

నిజానికి ఇలాంటి డిఫరెంట్ టైటిల్స్ నాని నుంచి వస్తున్నాయనేకంటే.. వివేక్ ఆత్రేయ నుంచే ఇలాంటి డిఫరెంట్ టైటిల్స్ వస్తున్నాయని చెప్పాలి. తన మొదటి సినిమాకు ‘మెంటల్ మదిలో’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఆత్రేయ.. రెండో సినిమాకు ‘బ్రోచేవారెవరురా’ అనే డిఫరెంట్ టైటిల్ పెట్టాడు. ఇప్పుడు తన హ్యాట్రిక్ మూవీకి ‘అంటే సుందరానికీ’ అనే మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశాడు.