గులాబీ వర్సెస్‌ కమలం… సోషల్‌ మీడియా ఫైట్ షురూ !

దుబ్బాక ప్రభావం కనిపిస్తోంది. గులాబీ వర్సెస్‌ కమలం యుద్ధం ముదురుతోంది. అసలైన సోషల్‌ మీడియా యుద్ధం మొదలైంది. గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ సానుభూతి పరులు, సోషల్‌ మీడియా కార్యకర్తలు బీజేపీ టార్గెట్‌గా తెగ పోస్టులు పెడుతున్నారు. బీజేపీ నేతలను ట్రోల్‌ చేస్తున్నారు. వారి మాటలే టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

దుబ్బాక టైమ్‌లో గులాబీ శ్రేణులు సోషల్‌ మీడియాలో సైలెంట్‌గా ఉన్నారు. హరీష్‌రావు తరపున పెద్దగా కామెంట్స్‌ పెట్టేవారే లేకుండాపోయారు. కనీసం కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. హరీష్‌ రావు వీడియోలకు కూడా షేర్ చేసేవాళ్ళ లేకుండా పోయారు.

దుబ్బాక ఫలితం తర్వాత గులాబీ శ్రేణులు అలర్ట్‌ అయ్యాయి. కేటీఆర్‌కు దగ్గరగా ఉండే సభ్యులు ఇప్పుడు తెగ పోస్టులు పెడుతున్నారు. కమలం టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు బీజేపీ సోషల్‌ మీడియా దళం కూడా ధీటుగా జవాబిస్తోంది. ఎన్నడూ లేని విధంగా పోస్టులు పెడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక రకంగా టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ ఫైట్‌ సోషల్‌ మీడియాలో తీవ్రంగా కన్పిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అటు కేంద్ర టీమ్‌ కూడా జీహెచ్‌ఎంసీపై ఫోకస్‌ పెట్టడంతో బీజేపీ సోషల్‌ మీడియాలో వేగం పెరిగింది. కౌంటర్ల మీద కౌంటర్లు పడుతున్నాయి.