పోలవరంలో అనుష్క ఏం చేస్తోంది?

అనుష్క ఇప్పుడు ఎక్కడుంది.. ఏం చేస్తోంది..? ఈ ప్రశ్నకు ఎవరైనా ఇచ్చే సమాధానం ఒకటే. ఆమె మంగళూరులో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. ఇంకా కొత్త సినిమా సెట్స్ పైకి రాలేదు. కానీ అనుష్క మాత్రం ఈరోజు చిన్న షాక్ ఇచ్చింది. సడెన్ గా పోలవరంలో ప్రత్యక్షమైంది ఈ బ్యూటీ.

కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతితో కలిసి పోలవరం వెళ్లింది అనుష్క. మాస్క్ వేసుకొని ఉండడంతో ఎవ్వరూ గుర్తుపట్టలేదు. పైగా వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ లాంటి హంగులు కూడా ఏమీ లేకుండా సింపుల్ గా వెళ్లడంతో ఎవ్వరూ ఊహించలేదు కూడా. అలా బోటులో గోదావరిలో విహరించింది బొమ్మాలి.

ఇంతకీ ఇంత సడెన్ గా అనుష్క పోలవరం ఎందుకు వెళ్లిందో తెలుసా? పోలవరం ప్రాజెక్టు చూడ్డానికి మాత్రం కాదు. గోదావరి మధ్యలో ఉన్న మహానందీశ్వర స్వామి ఆలయాన్ని ఆమె దర్శించింది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది.