మళ్లీ అదే హీరోయిన్ రిపీట్

సిద్ధూ జొన్నలగడ్డ-సీరత్ కపూర్… ఇప్పుడీ కాంబినేషన్ ఓటీటీలో హాట్ కాంబోగా మారింది. ఇద్దరూ కలిసి ఇప్పటికే ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ అనే సినిమా చేశారు. ఆ తర్వాత ‘మా వింత గాధ వినుమా’ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు సీరత్ కపూర్ హీరోయిన్ గా మరో సినిమా కూడా చేయబోతున్నాడు సిద్ధు.

లాక్ డౌన్ లో ఓటీటీ హీరో అనిపించుకున్న సిద్ధూ చేతిలో ప్రస్తుతం 4 సినిమాలున్నాయి. కేవలం నటించడమే కాకుండా, ఈ 4 సినిమాల్లో క్రియేటివ్ పార్టు కూడా తనే తీసుకుంటున్నాడు. ఇప్పుడీ సినిమాల్లో ఒక దాంట్లో సీరత్ కపూర్ కు మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు సిద్ధూ.

మొదటి రెండు సినిమాల్లో వీళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆ కెమిస్ట్రీని క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ జంట. ఆ కెమిస్ట్రీ సంగతి పక్కనపెడితే.. మరో సినిమా కలిసి చేస్తే, వీళ్లిద్దరిపై పుకార్లు పుట్టడం మాత్రం ఖాయం.