మెగా కాంపౌండ్ లో మరో పెళ్లిసందడి

మొన్ననే మెగా కాంపౌండ్ లో పెళ్లి బాజా మోగింది. మెగా డాటర్ నిహారికకు అట్టహాసంగా పెళ్లి చేశారు. పవన్ తో సహా మెగా హీరోలంతా ఉదయ్ పూర్ లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో హంగామా చేశారు. అలా నిహారికను అత్తారింటికి ఆర్భాటంగా పంపిన కొన్ని రోజులకే, ఆ కాంపౌండ్ నుంచి మరో పెళ్లి వార్త బయటకొచ్చింది.

ఈసారి మెగా కాంపౌండ్ నుంచి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అల్లు శిరీష్. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది అల్లు శిరీష్ పెళ్లి జరిగే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని స్వయంగా మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ బయటపెట్టాడు.

ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిధరమ్ తేజ్, తన పెళ్లిపై స్పందిస్తూ… తన పెళ్లికి ఇంకా 4-5 ఏళ్లు టైమ్ ఉందని ప్రకటించాడు. అయినా కాంపౌండ్ లో తనకంటే పెద్దవాడు శిరీష్ ఉన్నాడని, అతడి పెళ్లి వచ్చే ఏడాది జరిగే ఛాన్స్ ఉందని, ఆ తర్వాత తన పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు.