అంతా కలిసి ఆ హీరోను మోసం చేశారు

ఒకప్పటి హీరో రాజా, తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. ఓ సినిమాకు సంబంధించి అంతా కలిసి తనను నిలువునా మోసం చేశారని చెప్పుకొచ్చాడు. ఆ సినిమా పేరు మిస్టర్ మేధావి.

ఇంతకీ ఏం జరిగిందంటే.. మిస్టర్ మేధావి ఓవర్సీస్ రైట్స్ ను రాజా తీసుకున్నాడు. ఆ సినిమాపై అతడు చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే తనే స్వయంగా ప్రింట్స్ తీసుకొని అమెరికా వెళ్లాడు. దాదాపు 20 రాష్ట్రాల్లో తనే స్వయంగా డిస్ట్రిబ్యూటర్లకు ప్రింట్స్ ఇచ్చి, థియేటర్లు లాక్ చేసి వచ్చాడు.

అలా అమెరికాలో గ్రాండ్ గా ఆ సినిమా రిలీజైందని, కానీ తనకు ఒక్క డాలర్ కూడా రాలేదని అన్నాడు రాజా. ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా తనకు డబ్బులు ఇవ్వలేదని.. కేవలం శాలువా కప్పి పంపించారని చెప్పాడు.