కేజీఎఫ్2 రిలీజ్ డేట్ ఫిక్స్

మేకర్స్ అంతా వరుసగా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తూ ముందుగానే డేట్స్ లాక్ చేసుకుంటున్న
నేపథ్యంలో.. కేజీఎఫ్ యూనిట్ కూడా అప్రమత్తమైంది. తమ కొత్త సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించింది.
పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కేజీఎఫ్ ఛాప్టర్-2 సినిమాను జులై 16న విడుదల
చేయబోతున్నట్టు ఘనంగా ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ప్రస్తుతం సోషల్
మీడియాలో వైరల్ అవుతోంది.

‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1’ తో న‌‌రాచిలో మొద‌లైన రాకీభాయ్ దండ‌యాత్రం ప్యాన్ ఇండియా రేంజ్‌లో
బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద ఈ దండ‌యాత్ర‌ను కంటిన్యూ చేయ‌డానికి,
ఛాప్టర్-2తో రెడీ అయ్యాడు రాకీభాయ్ యష్.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ కాంబినేష‌న్‌లో హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో రూపొందుతోన్న ఈ
సినిమాలో సంజయ్ దత్, రవీనాటాండన్, ప్రకాశ్‌రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.

రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ 150 మిలియన్ వ్యూస్‌తో 7.5 మిలియన్ లైక్స్‌తో ఇండియన్
సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డే చెబుతోంది సినిమా కోసం ప్రేక్షకులు ఎంత క్రేజీగా
ఎదురుచూస్తున్నారో.